అల్పజాతివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినురవేమ!
పద్య అర్థం: చెడ్డవాడికి అధికారం ఇస్తే మంచివారందరినీ (దొడ్డవారినెల్ల...) వె ళ్లగొడతాడు. చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు, చెప్పు రుచి కంటె చెరుకు రుచి చాలా తియ్యగా ఉంటుంది కదా అని పెడితే, దానికి ఆ చెరుకులోని తియ్యదనం తెలియదు. దాని నోటికి చెప్పుల రుచే తియ్యగా ఉంటుంది. అది దాని జాతి లక్షణం. అలాగే దుష్టుైడె న వాడికి చెడుమాటలే బాగా నచ్చుతాయి. చెడ్డవారినే ఇష్టపడతాడు. తను చేసే చెడుపనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తారు. అందుకే అల్పజాతివానికి (దుష్టుడైన వానికి) పాలన అధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచివారిని (దొడ్డవారినెల్ల) ఆయా పనులలోంచి తీసివేస్తాడు. సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి, చిన్నచిన్న పదాలతో ఉండే పద్యంలో చక్కగా వివరించాడు వేమన.