Wednesday, 19 November 2014

వేమన పద్యం - 07

అడవి యడవి దిరిగి, యాసలు విడలేక
గాసి పడెడు వాడు ఘనుడు గాడు;
రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన
వాడె, పరముగన్న వాడు వేమ!

భావం: ఆత్మజ్ఞానం పొదగోరు వారు, మోక్షగాములూ పూర్తి ఆశలనూ, మోహాలను తొలగించుకోకుండానే ,
ఎన్ని అడవులు దిరిగినా , ఎంత శ్రమ పడినా వాడు గొప్పవాడు కాలేడు, పూర్తి వైరాగ్యంతో మనస్సును 
ఏకచిత్తముగా నిలిపిన వాడే పరమత్ముని తెలుసుకోగలుగుతున్నాడు అని భావం. 


Monday, 10 November 2014

Telugu kavithalu 18

రా నేస్తం.....
నీలి మబ్బులను ఒడిసి పట్టి
వాన చినుకుల రుచి చూపిస్తా.....
పైర గాలుల పరిమళాన్ని
నీ తనువుకు అత్తరుగా చేస్తా.....

రా నేస్తం.....
నీలి సంద్రపు నీలమంతా
నీ కనుపాపలలో నింపేస్తా.....
మేరు పర్వత శిఖరాలపై 
నీ విజయ బావుటా ఎగురవేస్తా.....

రా నేస్తం.....
కమ్మని కలల ఒడిలో 
వెచ్చగా నిదురపుచ్చుతా.....
కలతలు లేని వసంతాన్ని 
జీవితమంతా అందిస్తా.....

రా నేస్తం.....
వేల తారల వెలుగులు తెచ్చి
నీ నవ్వులుగా మార్చేస్తా.....
పాల నురగల వెల్లువ తెచ్చి
నీ బుగ్గలలో పూయిస్తా.....
............................Om's.....✍



Thursday, 30 October 2014

Vemana Padyam

అల్పజాతివానికధికారమిచ్చిన 
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినురవేమ!

పద్య అర్థం: చెడ్డవాడికి అధికారం ఇస్తే మంచివారందరినీ (దొడ్డవారినెల్ల...) వె ళ్లగొడతాడు. చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు, చెప్పు రుచి కంటె చెరుకు రుచి చాలా తియ్యగా ఉంటుంది కదా అని పెడితే, దానికి ఆ చెరుకులోని తియ్యదనం తెలియదు. దాని నోటికి చెప్పుల రుచే తియ్యగా ఉంటుంది. అది దాని జాతి లక్షణం. అలాగే దుష్టుైడె న వాడికి చెడుమాటలే బాగా నచ్చుతాయి. చెడ్డవారినే ఇష్టపడతాడు. తను చేసే చెడుపనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తారు. అందుకే అల్పజాతివానికి (దుష్టుడైన వానికి) పాలన అధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచివారిని (దొడ్డవారినెల్ల) ఆయా పనులలోంచి తీసివేస్తాడు. సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి, చిన్నచిన్న పదాలతో ఉండే పద్యంలో చక్కగా వివరించాడు వేమన.



Wednesday, 8 October 2014

Telugu kavithalu 17 నిన్ను ప్రేమించడం

నిన్ను ప్రేమించడం అంటే
నీ అందాన్ని మాత్రమే ప్రేమించడం కాదు

నీ ఆలోచనలని ప్రేమించడం...
నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించడం...
నీలోని మంచినీ, చెడునీ ప్రేమించడం...
నీ సమస్తాన్ని, నీ ప్రపంచాన్ని ప్రేమించడం... 

నీకు స్వేచ్చనివ్వడంలోనే నా ఆనందాన్ని వెతుక్కోవడం,
అది నాకే సాధ్యం ప్రియతమా.....
........................................................................Om's... ✍



Telugu kavithalu 16 నీ నవ్వుల్లో

విరిసేటి నీ నవ్వుల్లో 
నే గాంచిన కుసుమాలు 
ఎన్నని చెప్పను నేస్తం...
శతకోటి పుష్పాల సౌందర్యమంతా 
నీ నవ్వులోనే దాగున్నాయి... 
.................................................Om's... ✍



Telugu kavithalu 15 తారకలన్నీ పేర్చి

తారకలన్నీ పేర్చి, నీ పలువరుసగా 
మార్చుకున్నావా చెలీ !
నువు నవ్వినపుడల్లా 
ఏవో వెలుగు రేఖలు 
నను అల్లుకుంటున్నాయి ?
.................................................Om's... ✍