Monday, 10 November 2014

Telugu kavithalu 18

రా నేస్తం.....
నీలి మబ్బులను ఒడిసి పట్టి
వాన చినుకుల రుచి చూపిస్తా.....
పైర గాలుల పరిమళాన్ని
నీ తనువుకు అత్తరుగా చేస్తా.....

రా నేస్తం.....
నీలి సంద్రపు నీలమంతా
నీ కనుపాపలలో నింపేస్తా.....
మేరు పర్వత శిఖరాలపై 
నీ విజయ బావుటా ఎగురవేస్తా.....

రా నేస్తం.....
కమ్మని కలల ఒడిలో 
వెచ్చగా నిదురపుచ్చుతా.....
కలతలు లేని వసంతాన్ని 
జీవితమంతా అందిస్తా.....

రా నేస్తం.....
వేల తారల వెలుగులు తెచ్చి
నీ నవ్వులుగా మార్చేస్తా.....
పాల నురగల వెల్లువ తెచ్చి
నీ బుగ్గలలో పూయిస్తా.....
............................Om's.....✍



No comments:

Post a Comment