Wednesday, 19 November 2014

వేమన పద్యం - 07

అడవి యడవి దిరిగి, యాసలు విడలేక
గాసి పడెడు వాడు ఘనుడు గాడు;
రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన
వాడె, పరముగన్న వాడు వేమ!

భావం: ఆత్మజ్ఞానం పొదగోరు వారు, మోక్షగాములూ పూర్తి ఆశలనూ, మోహాలను తొలగించుకోకుండానే ,
ఎన్ని అడవులు దిరిగినా , ఎంత శ్రమ పడినా వాడు గొప్పవాడు కాలేడు, పూర్తి వైరాగ్యంతో మనస్సును 
ఏకచిత్తముగా నిలిపిన వాడే పరమత్ముని తెలుసుకోగలుగుతున్నాడు అని భావం. 


Monday, 10 November 2014

Telugu kavithalu 18

రా నేస్తం.....
నీలి మబ్బులను ఒడిసి పట్టి
వాన చినుకుల రుచి చూపిస్తా.....
పైర గాలుల పరిమళాన్ని
నీ తనువుకు అత్తరుగా చేస్తా.....

రా నేస్తం.....
నీలి సంద్రపు నీలమంతా
నీ కనుపాపలలో నింపేస్తా.....
మేరు పర్వత శిఖరాలపై 
నీ విజయ బావుటా ఎగురవేస్తా.....

రా నేస్తం.....
కమ్మని కలల ఒడిలో 
వెచ్చగా నిదురపుచ్చుతా.....
కలతలు లేని వసంతాన్ని 
జీవితమంతా అందిస్తా.....

రా నేస్తం.....
వేల తారల వెలుగులు తెచ్చి
నీ నవ్వులుగా మార్చేస్తా.....
పాల నురగల వెల్లువ తెచ్చి
నీ బుగ్గలలో పూయిస్తా.....
............................Om's.....✍