వేమన పద్యాలు

వేమన్న చెప్పింది వేదమ్మురా

లోక కవి వేమన నేనెంతో అభిమానించే వ్యక్తి, అందుకే ఇక్కడ నా కవితలతో పాటు ఆ మహనీయుని పద్యాలను అందిస్తున్నాను, మీరూ చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను, ధన్యవాదములు__/\__


వేమన పద్యాలు - 5 (vemana padyalu - 13)



వేమన పద్యాలు - 5 (vemana padyalu -12)


 వేమన పద్యాలు - 5 (vemana padyalu - 11)



వేమన పద్యాలు - 5 (vemana padyalu - 10)


వేమన పద్యాలు - 5 (vemana padyalu - 9)



వేమన పద్యాలు - 5 (vemana padyalu - 8)


వేమన పద్యాలు - 5 (vemana padyalu - 7)

అడవి యడవి దిరిగి, యాసలు విడలేక
గాసి పడెడు వాడు ఘనుడు గాడు;
రోసి రోసి మదిని రూఢిగా నిలిపిన
వాడె, పరముగన్న వాడు వేమ!

భావం: ఆత్మజ్ఞానం పొదగోరు వారు, మోక్షగాములూ పూర్తి ఆశలనూ, మోహాలను తొలగించుకోకుండానే ,
ఎన్ని అడవులు దిరిగినా , ఎంత శ్రమ పడినా వాడు గొప్పవాడు కాలేడు, పూర్తి వైరాగ్యంతో మనస్సును 
ఏకచిత్తముగా నిలిపిన వాడే పరమత్ముని తెలుసుకోగలుగుతున్నాడు అని భావం. 



వేమన పద్యాలు - 5 (vemana padyalu - 6)

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ

భావం - ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం ఎమనగా సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)



వేమన పద్యాలు - 5 (vemana padyalu - 5)

అల్పజాతివానికధికారమిచ్చిన 
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినురవేమ!

పద్య అర్థం: చెడ్డవాడికి అధికారం ఇస్తే మంచివారందరినీ (దొడ్డవారినెల్ల...) వె ళ్లగొడతాడు. చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు, చెప్పు రుచి కంటె చెరుకు రుచి చాలా తియ్యగా ఉంటుంది కదా అని పెడితే, దానికి ఆ చెరుకులోని తియ్యదనం తెలియదు. దాని నోటికి చెప్పుల రుచే తియ్యగా ఉంటుంది. అది దాని జాతి లక్షణం. అలాగే దుష్టుైడె న వాడికి చెడుమాటలే బాగా నచ్చుతాయి. చెడ్డవారినే ఇష్టపడతాడు. తను చేసే చెడుపనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తారు. అందుకే అల్పజాతివానికి (దుష్టుడైన వానికి) పాలన అధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచివారిని (దొడ్డవారినెల్ల) ఆయా పనులలోంచి తీసివేస్తాడు. సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి, చిన్నచిన్న పదాలతో ఉండే పద్యంలో చక్కగా వివరించాడు వేమన.




వేమన పద్యాలు - 4 (vemana padyalu - 4)



వేమన పద్యాలు - 3 (vemana padyalu - 3)




వేమన పద్యాలు - 2 (vemana padyalu -2)


4 comments:

  1. రాతి బొమ్మకు ఎలా రంగైన వలువలు ఈ పద్యం పొందుపరచండి

    ReplyDelete
  2. Good collection.but meaning is different search for correct meaning at www. thraithashakam.org

    ReplyDelete
  3. మంచి భావాలు

    ReplyDelete